Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'మెసేజ్ అందింది'.. జైలు వ్యాఖ్యలకు ఎలాన్ మస్క్ కౌంటర్

Elon Musk responds to jail comments with message received
Advertisement
  • డెమోక్రాట్లు గెలిస్తే మస్క్ జైలుకు వెళ్తారన్న జర్నలిస్ట్ 
  •  జర్నలిస్ట్ కారా స్విషర్‌కు ఘాటుగా కౌంటర్ ఇచ్చిన మస్క్
  • ఎన్నికలను కొనుగోలు చేస్తున్నారంటూ మస్క్‌పై బెర్నీ శాండర్స్ విమర్శలు 
Advertisement
టెస్లా, ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. అమెరికాలో డెమోక్రాట్లు అధికారంలోకి వస్తే ఆయన జైలుకు వెళ్లాల్సి రావొచ్చని ప్రముఖ టెక్ జర్నలిస్ట్ కారా స్విషర్ చేసిన వ్యాఖ్యలపై మస్క్ స్పందించారు. కేవలం రెండే రెండు పదాల్లో ‘మెసేజ్ అందింది’ అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.  

ప్రముఖ టెక్నాలజీ జర్నలిస్ట్, పాడ్‌కాస్టర్ అయిన కారా స్విషర్, "బుల్వార్క్ పాడ్‌కాస్ట్"లో మాట్లాడుతూ ఎలాన్ మస్క్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ 2026 మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్లు కాంగ్రెస్‌లోని సెనేట్, ప్రతినిధుల సభను తిరిగి చేజిక్కించుకుంటే మస్క్ తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో మస్క్ కంపెనీలపై విచారణలు ఆగిపోయాయని, డెమోక్రాట్లు అధికారంలోకి వస్తే అవి తిరిగి ప్రారంభమవుతాయని ఆమె జోస్యం చెప్పారు. "ఒకవేళ కమలా హారిస్ అధికారంలో ఉండి ఉంటే, మస్క్ బహుశా ఇప్పటికే జైల్లో ఉండేవారు. ఏం జరగబోతోందో ఆయనకు తెలుసు. విధి ఆయనను వెతుక్కుంటూ వస్తోంది, అది కూడా చాలా బలంగా" అని స్విషర్ వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలపై మొదట ‘మెసేజ్ అందింది’ అని స్పందించిన మస్క్, ఆ తర్వాత మరో ఘాటైన పోస్ట్ చేశారు. "కత్తితో బతికేవాడు కత్తికే చస్తాడు. ఈ మాటలు చూస్తుంటే స్విషర్ నిజంగా జైలుకు వెళ్లాలనుకుంటున్నట్లుంది" అని కౌంటర్ ఇచ్చారు.

మరోవైపు అమెరికా సెనేటర్ బెర్నీ శాండర్స్ కూడా ఎలాన్ మస్క్‌పై విమర్శలు గుప్పించారు. మధ్యంతర ఎన్నికల కోసం మస్క్ తన సూపర్ పీఏసీల ద్వారా 400 మిలియన్ డాలర్లకు పైగా ఖర్చు చేస్తున్నారని, ఇది "మధ్యంతర ఎన్నికలను కొనుగోలు చేసే ప్రయత్నమే" అని ఆయన ఆరోపించారు.  
Advertisement
Advertisement
Elon Musk
Kara Swisher
Bernie Sanders
US Elections
X Social Media
US Democrats

More Telugu News